దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న 58 రాజ్యసభ స్థానాలకు మార్చి 23న ఎన్నిక జరుగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మూడు చొప్పున మొత్తం ఆరు స్థానాలకు ఆరోజు ఎన్నిక జరుగనుంది.

పదవీవిరమణ చేయబోతున్నవారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి చిరంజీవి, రేణుకాచౌదరి, దేవేందర్‌గౌడ్‌, తెలంగాణ నుంచి సీఎం రమేష్‌, రాపోలు ఆనందభాస్కర్‌లు ఉన్నారు.

ఈ ఆరుగురిలో ఒక్క సీఎం రమేష్‌ కు తప్ప ఎవరికీ తిరిగి నామినెటే అయ్యే అవకాశం దాదాపుగా లేనట్టే. సంఖ్యాబలం బట్టి తెలుగు దేశం పార్టీకి రెండు, వైకాపాకు ఒక సీటు రావాల్సి ఉంది. అయితే ఆంధ్రాలో ఉన్న పరిస్థితుల బట్టి ఈ ఎన్నిక రసవత్తరంగా జరగబోతుంది. వైకాపా నుండి చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ కావడంతో మరో 2-3 ఎమ్మెల్యేలను లాక్కోగలిగితే టీడీపీ ఈ సీటును కైవసం చేసుకోవచ్చు.

ALSO READ:  علحدہ بلز کی صورت میں مسلم تحفظات کو خطرہ، ایس ٹی کی منظوری کا امکان

అయితే వైకాపా టీడీపీలో జాయిన్ అయినా కొంత మందిని తిరిగి వెనక్కు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ బీజేపీ మధ్య పెరిగిన అగాధం వల్ల ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మూడు సీట్లు కైవసం చేసుకోగలిగితే గనుక టీడీపీ నైతికంగా విజయం సాధించినట్టే. #KhabarLive