నిన్న మీడియా సమావేశంలో బిజెపి, కాంగ్రెస్ ను ఒకే రీతిలో తెలంగాణ సిఎం కేసిఆర్ కడిగిపారేశారు. బిజెపి పై ఒకింత గట్టిగానే విమర్శలు గుప్పించారు. తాను అనని మాటలు పట్టుకుని బిజెపి గాయ్ గాయ్ చేస్తోందని ఆగ్రహించారు. జైలుకు పంపుతామన్న కామెంట్లపై మండిపడ్డారు. ఇక కేసిఆర్ కామెంట్లకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గట్టి కౌంటరే ఇచ్చారు. కేసిఆర్ పెట్టబోయే ఫ్రంట్లకు టెంట్లు కూడా దిక్కు ఉండవని పంచ్ వేశారు. ఇలాంటి ఫ్రంటులు ఎన్నో వచ్చాయి.. పోయాయి అన్నది గుర్తుంచుకోవాలన్నారు. మీడియా సమావేశంలో లక్ష్మణ్ ఇంకా ఏం మాట్లాడారో చదవండి.

70 ఏళ్లలో జరగని అభివృద్ధి మోడీ చేసి చూపారు. అందుకే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ కి అనుకూల ఫలితాలు వచ్చాయి. కమ్యూనిస్టుల బెదిరింపు రాజకీయాలకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాము. కర్ణాటక లో కూడా బీజేపీ విజయం సాధించబోతున్నది. తెలంగాణ లో కూడా బీజేపీ గెలుస్తుందని కేసీఆర్ భయపడుతున్నాడు. అందుకే బీజేపీ పై విమర్శలు చేస్తున్నారు. త్రిపుర లో గతంలో ఒక్క ఎమ్మెల్యే లేకున్నా అధికారంలోకి వచ్చాము. ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని కేసీఆర్ కు గుబులు పట్టుకుంది. ప్రేస్టేషన్ తో కేసీఆర్ మాట్లాడుతున్నారు.

ALSO READ:  ‍Shabby ‍Resettlement And Rehabilitation Packages Make Land Pooling Tricky For Telangana

బీజేపీ విజయాల ధాటికి తట్టుకోలేక ఫ్రంట్ లని కేసీఆర్ అంటున్నారు. కానీ ఆ ఫ్రంట్ లకు టెంట్స్ కూడా లేవని గుర్తుంచుకుంటే మంచిది. ఓటమి ఛాయల ఉన్న పార్టీలను తీసుకొచ్చి ఫ్రంట్ చేస్తామంటుంన్నారు. గతంలో ఈ ఫ్రంట్ లను చాలా చూసాం. ఈ ఫ్రంట్ లు ఎలా మూడునాళ్ల ముచ్చట అయిందో అందరికి తెల్సు. కేసీఆర్ పాలనలో ఆ నలుగురే బాగుపడ్డారు. బీజేపీ మినహాయిస్తే అన్ని పార్టీలతో అంటకాగినది టి ఆర్ఎస్ పార్టే. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. కేసీఆర్ వాపు ను చూసి బలుపు అనుకుంటున్నారు. అంగట్లో కొన్న విధంగా ఎమ్మెల్యే లను కొన్నారు. ఇదేనా గుణాత్మక పాలన.? కేసీఆర్ ఫ్రంట్ లని మాట్లాడుకుంటే జనాలు నవ్వుతున్నారు.

ALSO READ:  Why One Nation One Poll Is A Lose-Lose Situation For Indian Voters

ప్రతిపక్షాలకు, ప్రజా సంఘలకు అవకాశం ఇవ్వని మీ పాలన గుణాత్మక పాలననా? రైతులకు బేడీలు, నెరేళ్ల దళితుల పై దాడి గుణాత్మపాలనలో భాగమేనా కేసిఆర్ చెప్పాలి. మోడీ పాలనే గుణాత్మక పాలన.. తెలంగాణలో సాగుతున్నది గడీల పాలన. గడీల పాలన నుండి ప్రజలు విముక్తి పొందలనుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆదాయ వనరు అయినా హైదరాబాద్ కు కేసీఆర్ ప్రభుత్వము ఎంత కేటాయిస్తున్నారో చెప్పాలి.

ముస్లిం రిజర్వేషన్ ల పేరుతో కేసీఆర్ డ్రామాకు తెరలేపారు. కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచుకోడానికి కేంద్రం పై నిందలు వేస్తున్నారు. కేసీఆర్ రిజర్వేషన్ మోసాలను ముస్లిం సోదరులు గ్రహిస్తున్నారు. కేంద్ర నిధులు ఇచ్చినా ఎన్ని పనులు ఆగిపోయాయో అసెంబ్లీ లో చర్చపెట్టండి. చర్చ కు బీజేపీ సిద్ధం. మిషన్ భగీరథకు,మిషన్ కాకతీయకు ఎంత బడ్జెట్ కేటాయించారో కేసీఆర్ చెప్పాలి వాటి పై కూడా చర్చ చేద్దాం. దమ్ముటే ఎంఐఎం తెలంగాణ అంతట పోటీ చేయాలి.

ALSO READ:  'House Fulled' IKEA India Wants To 'Calm Down' At Stores In Hyderabad

అప్పుడు ఎవరి బలం ఎంతో తేల్చుకుంటాం. ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరడం ఎంఐఎం కు అలవాటు. ఎంఐఎం ను సమర్థవంతంగా ఎదురుకోవాలంటే బీజేపీ కే సాధ్యం. కాంగ్రెస్, ఎంఐఎం,టి ఆర్ ఎస్ లు అంత ఒక్కటే. మోడీ పథకాలను పల్లె పల్లె కు తీసుకుపోతాము. రాష్ట్ర ప్రభుత్వము పై పోరాటం చేస్తాం.

కేసీఆర్ నోరు జారిండు అని కేటీఆర్ , కవితే చెప్పారు. చేసిన పొరపాటు ను కేసీఆర్ హుందాగా ఒప్పుకోవాలి. త్రిపుర లో శూన్యం నుండి అధికారంలోకి వచ్చాము. తెలంగాణ లో కూడా అధికారంలోకి వస్తాం. తెలంగాణ లో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. #KhabarLive