పైకి కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేసి, లోలోపల మాత్రం భాజపాతో పొత్తును అలానే కొనసాగిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం గురించి ప్రజలు మరిచిపోయేలా చేసేందుకు అనుకూల మీడియాతో కలిసి బృహత్తర పథకం వేశారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా వంచించిందో ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టారు చంద్రబాబు. ప్రత్యేక ప్యాకేజీ పేరుచెప్పి రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదట, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మొండిచేయి చూపించారట. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు వివరించాలని తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

నిజానికి ఈ విషయాలేవీ చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమాన్ని దాదాపు వంద రోజులుగా జగన్ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా ఎంత అవసరమో వివరిస్తున్నారు. ప్యాకేజీ వల్ల ప్రజలు ఎంత నష్టపోయారో.. పచ్చ నేతలు ఎంత లాభపడ్డారో ఏ రోజుకారోజు కొత్తకొత్తగా విడమర్చి చెబుతూనే ఉన్నారు.

ALSO READ:  ‘తెలంగాణ’ పదం – సంస్కృత పరిష్వంగ సుఖం

ఇప్పుడు ప్రజలకు చంద్రబాబు చెప్పాల్సింది ఈ విషయాలు కాదు. అసలు ఈ నాలుగేళ్లలో బీజేపీతో కాపురం చేసినప్పుడు ప్రత్యేక హోదా అంశం గుర్తుకు రాలేదా..? ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు రావట్లేదనే విషయం ఈ చివరాఖరి సంవత్సరంలోనే గుర్తొచ్చిందా..? మొన్నటివరకు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడెందుకు మడమ తిప్పి హోదా టర్న్ తీసుకున్నారు..?

ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే ఈ విషయాలపై వివరణ ఇవ్వాలి చంద్రబాబు. అంతేతప్ప, మనం మోసపోయామంటూ బీద అరుపులు అరిస్తే, వినడానికి ప్రజలు అంత అమాయకులు కారు. నిజానికి తమను మోసం చేస్తోంది బీజేపీనా, నాలుగేళ్లుగా అమరావతి పేరు చెప్పి ఎంజాయ్ చేస్తున్న తెలుగుదేశమా అనే విషయంపై ఇప్పటికే ప్రజలకు ఓ అవగాహన వచ్చింది. వాళ్లు మెల్లమెల్లగా జగన్ వైపు చూస్తున్నారు కూడా. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ మిత్రపక్షమైన బీజేపీకి చెందిన విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు.

ALSO READ:  The Hidden Tragedy In Bangladesh's Rohingya Refugee Camps

పార్టీలతో సంబంధం లేకుండా, ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరుతెచ్చుకున్న విష్ణుకుమార్ రాజు.. ప్రస్తుతం ప్రజలు జగన్ వైపు ఆకర్షితులవుతున్నారని, చంద్రబాబును, తెలుగుదేశాన్ని నమ్మే పరిస్థితి నుంచి బయటకొస్తున్నారని అన్నారు. జగన్ సభలకు వస్తున్న జనాల్ని చూస్తే తనకే ఆశ్చర్యం వేస్తుందని కూడా అన్నారు.

సరే, ఈ విషయాలు పక్కనపెడితే.. ఇన్నాళ్లు మభ్యపెట్టే మాటలతో ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంపై కూడా మడమతిప్పే మాటలు మాట్లాడుతున్నారు. అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. నిజమే అవిశ్వాసం పెడితే కేంద్ర ప్రభుత్వం పడిపోదు.

కానీ మనమేంటో.. మనం ఎంత సమైక్యంగా ఉన్నామో కేంద్రానికి తెలుస్తుంది కదా. స్పెషల్ స్టేటస్ పై మనం ఎంత పట్టుదలతో ఉన్నామో చెప్పడానికి ఆఖరి అస్త్రంగా దాన్ని ప్రయోగించడానికి తప్పేంటి? నిజంగా అవిశ్వాసం వల్ల కేంద్ర ప్రభుత్వం పడిపోకపోయినా.. పార్లమెంట్ లో నోటీసు ఇచ్చామంటే అది వాళ్లకు అవమానకరం కాదా..? ఈ విషయాల్ని చంద్రబాబు కావాలనే మరుగున పెడుతున్నారు.

ALSO READ:  Hyderabad Literary Festival Raises Patriotic Fervour With Gandhian Flavour

ఓవైపు అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తామంటూ ఎంపీలు, ఇతర పార్టీలు చేస్తున్న ప్రకటనలు చూస్తునే ఉన్నాం. కానీ అవిశ్వాసం పెడితే అది చర్చకు రాదని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై మాత్రమే చర్చ జరుగుతుందని చంద్రబాబు వాదిస్తున్నారు. తీర్మానం పెట్టకముందే ఎందుకీ వైరాగ్యం. చంద్రబాబు ఏమైనా పార్లమెంటరీ వ్యవహారాల శాఖను చూస్తున్నారా..? లేక స్పీకర్ ను శాసిస్తున్నారా..? ఎప్పుడేం జరుగుతుందో ఆయనకు ముందే తెలిసిపోతుందా..? ఎందుకిలా తప్పించుకు తిరగడం..?

ప్రజల్లోకి వెళ్లి, వాళ్లకు వివరణ ఇవ్వాలనుకుంటే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయడం లేదు. మరోసారి తన 40ఏళ్ల అనుభవాన్ని రంగరించి ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రణాళికను ఈరోజు నుంచి అమలు చేయాలని సిద్ధమైపోయారు. ప్రజలారా బహుపరాక్.. #KhabarLive

4 COMMENTS

  1. I simply want to say I’m very new to blogging and definitely liked this page. Almost certainly I’m planning to bookmark your blog post . You definitely come with excellent articles. With thanks for sharing with us your website page.

  2. Hey there, just turned out to be familiar with your website through yahoo, and discovered that it’s quite educational. I’ll value in the event you keep up these.

  3. F*ckin’ tremendous things here. I’m very glad to look your post. Thank you so much and i’m having a look ahead to contact you. Will you kindly drop me a e-mail?

Comments are closed.